Balakrishna: బాలకృష్ణతో పాటే బరిలోకి రవితేజ?

Khiladi movie update
  • 'అఖండ' షూటింగు పూర్తి 
  • దీపావళికి రిలీజ్ అంటూ టాక్ 
  • అదే రోజున 'ఖిలాడి' విడుదల?
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి  
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. గతంలో వచ్చిన రెండు సినిమాలు సంచలన విజయాన్ని సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ విషయం కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముందుగా దసరాకి అనుకున్నప్పటికీ, అప్పటికి కుదరకపోవడంతో దీపావళికి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అదే రోజున రవితేజ సినిమా 'ఖిలాడి' కూడా బరిలో దిగనుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
 
కాకతాళీయమే అయినా గతంలో బాలకృష్ణ .. రవితేజ సినిమాలు చాలా దగ్గర దగ్గరగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఈ సారి కూడా జరగనుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతనేది చూడాలి. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కనువిందు చేయనున్నారు.
Balakrishna
Boyapati Sreenu
Raviteja
Ramesh varma

More Telugu News