Samantha: షూటింగులో కంటతడి పెట్టుకున్న సమంత

Samantha breaks down while shooting ad in Hyderabad after divorce
  • నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత
  • విడాకుల ప్రకటన తర్వాత షూటింగులో పాల్గొన్న సామ్
  • షూటింగ్ బ్రేక్ సమయంలో భావోద్వేగానికి గురైన వైనం

పదేళ్ల ప్రేమ, రెండేళ్ల వైవాహిక బంధం తర్వాత సమంత, నాగచైతన్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన తర్వాత సమంత తొలిసారి షూటింగ్ లో పాల్గొంది. హైదరాబాదులోని ముకరంజా జూనియర్ కళాశాలలో ఒక యాడ్ షూటింగ్ లో ఆమె పాల్గొంది. షూటింగ్ లో బ్రేక్ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కంట తడిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ యాడ్ ను ముంబై బేస్డ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ తీస్తున్నారు.

అయితే  ఈ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సమంత విడాకుల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యాడ్ షూటింగ్ కు ఆమె రాగలదా? అనే సందేహంలో యూనిట్ పడిపోయింది. కానీ, ఎంతో బాధలో ఉన్నప్పటికీ సమంత షూటింగ్ లో పాల్గొని, తన ప్రొఫెషనలిజంను చాటుకుంది.

  • Loading...

More Telugu News