Tollywood: ముంబై షిఫ్టింగ్ వార్తలు ఉత్తవే.. హైదరాబాద్‌లోనే సమంత మకాం!

Actress Samantha Stays in Hyderabads Gachibowli
  • ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు గతంలో వార్తలు
  • హైదరాబాద్ తన హోం టౌన్ అన్న సమంత
  • గచ్చిబౌలిలోనే ఓ ఫ్లాట్‌లో నివాసం
నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత ముంబైకి మకాం మార్చేస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. నాగచైతన్యతో విడాకుల వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్న సమయంలో సమంత ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసిందని, విడాకుల తర్వాత అక్కడే ఉండబోతోందన్న రూమర్లు వినిపించాయి.

అయితే, ఇప్పుడీ వార్తలలో వాస్తవం లేదని తేలిపోయింది. తనను స్టార్‌గా చేసిన హైదరాబాద్‌లోనే ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సమంత గతంలోనే స్పష్టత ఇచ్చింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ అని, ఇప్పటికీ ఎప్పటికీ అని చెప్పడంతో ఆమె నగరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు అభిమానులకు అర్థమైంది.

అయితే, హైదరాబాద్‌లో ఎక్కడ? అన్నదానికి కూడా ఆన్సర్ దొరికేసింది. గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో సమంత నివసించనున్నట్టు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ తెలుగు చిత్రంతో పాటు, ‘కాతు వాకుల రెందు కాదల్’ అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.
Tollywood
Samantha
Actress
Naga Chaitanya
Hyderabad
Gachibowli

More Telugu News