'అరణ్మనై 3' నుంచి రేపు మరో సింగిల్!

05-10-2021 Tue 19:14
  • హారర్ కామెడీగా 'అరణ్మనై 3'
  • ప్యాలెస్ చుట్టూ అల్లుకున్న కథ
  • సత్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • ఈ నెల 14వ తేదీన విడుదల  
Aranmanai 3 movie update

కోలీవుడ్లో హారర్ కామెడీ సినిమాలను తెరకెక్కించే దర్శకుల జాబితాలో లారెన్స్ తరువాత స్థానంలో సుందర్ సి కనిపిస్తారు. ఆయన నుంచి సిరీస్ గా వస్తున్న 'అరణ్మనై' .. 'అరణ్మనై 2' భారీ విజయాలను అందుకున్నాయి. ప్రేతాత్మలతో ముడిపడిన కథలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన 'అరణ్మనై 3' సినిమాను చేశాడు. ఇది కూడా ఒక ప్యాలెస్ చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథనే. ముందుగా వచ్చిన రెండు భాగాలలో హన్సిక .. త్రిష .. ఆండ్రియాలకు అవకాశం ఇచ్చిన సుందర్, ఈ సినిమాలో రాశి ఖన్నాకు అవకాశం ఇచ్చాడు. ఆర్య జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు 4వ సింగిల్ రానున్నట్టుగా చెప్పారు. సత్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. సాక్షి అగర్వాల్ .. సంపత్ రాజ్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.