ఏఆర్ రెహమాన్ బతుకమ్మ పాటపై కల్వకుంట్ల కవిత స్పందన

05-10-2021 Tue 18:46
  • తెలంగాణలో బతుకమ్మ సీజన్
  • 'అల్లిపూల వెన్నెల' పాట రూపొందించిన రెహమాన్, గౌతమ్ మీనన్ 
  • బతుకమ్మ వచ్చేసిందంటూ కవిత వ్యాఖ్యలు
  • తెలంగాణ జాగృతి యూట్యూబ్ చానల్లో బతుకమ్మ పాట
Kalvakuntla Kavitha opines on AR Rahman Bathukamma song

సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలసి రూపొందించిన బతుకమ్మ పాటపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. వర్ణభరితం, మాధుర్యసహితం, ఐక్యతకు ప్రతిరూపం అయిన బతుకమ్మ వచ్చేసింది అని కవిత పేర్కొన్నారు. నా అక్కచెల్లెళ్లలారా... బతుకమ్మపై ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మీతో పంచుకుంటున్నాను అంటూ తెలంగాణ మహిళలను ఉద్దేశించి పేర్కొన్నారు. 'అల్లిపూల వెన్నెల' అంటూ సాగే ఈ గీతాన్ని కవిత తెలంగాణ జాగృతి యూట్యూబ్ చానల్లో పంచుకున్నారు.