దసరాకి సెకండ్ సింగిల్ వదులుతున్న 'పుష్ప'

05-10-2021 Tue 18:34
  • ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ 
  • 13వ తేదీన రిలీజ్ కానున్న సెకండ్ సింగిల్
  • శ్రీవల్లి పాత్రలో సందడి చేయనున్న రష్మిక 
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల  
Pushpa second single will release at Dasara

అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'పుష్ప' సినిమాను నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ .. గిరిజన యువతిగా రష్మిక నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెబుతున్నారు.  

ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వదిలిన 'దాక్కో .. దాక్కో మేక' అనే పాట, రికార్డుస్థాయిలో వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టింది. అప్పటి నుంచి అందరినీ సెకండ్ సింగిల్ ఊరిస్తూ ఉంది. ఇప్పుడు ఇక సెకండ్ సింగిల్ వదలడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 13వ తేదీన సెకండ్ సింగిల్ ను వదలనున్నట్టు చెప్పారు.

అందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, రష్మిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో కనిపించనుంది. సెకండ్ సింగిల్ గా .. రష్మికపై చిత్రీకరించిన పాట ఉండనుందనే విషయం అర్థమవుతోంది. మరి సెకండ్ సింగిల్ ఏ రేంజ్ లో దూసుకెళుతుందో చూడాలి. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.