రేపటి నుంచి తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులు

05-10-2021 Tue 17:10
  • పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 17 వరకు సెలవులు
  • జూనియర్ కాలేజీలకు 13 నుంచి 17 వరకు సెలవులు
  • ఇటీవలే ప్రారంభమైన భౌతిక తరగతులు
Dasara Holidays for Telangana schools from tomorrow
తెలంగాణలోని పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను విద్యాసంస్థలు పాటించాలని... ఆదేశాలను పట్టించుకోకుండా తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవలే భౌతిక తరగతులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలు దాదాపు 18 నెలల తర్వాత ప్రారంభమయ్యాయి.