Mallu Bhatti Vikramarka: 'దళితబంధు'పై ప్రశ్నల వర్షం కురిపించిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka questions on Dalit Bandhu in assembly session
  • తెలంగాణ అసెంబ్లీలో దళితబంధుపై చర్చ
  • సందేహాలపై వివరణ ఇవ్వాలన్న భట్టి
  • దళితబంధుకు నిధులు ఎక్కడ్నించి తెస్తారని ప్రశ్న
  • రాజకీయాలకు అతీతంగా సాగాలని సూచన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు దళితబంధు పథకంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

  • దళితబంధు పథకానికి నిధులు ఎలా కేటాయిస్తారు?
  • దళితబంధు పథకానికి అర్హులైన వారు రూ.10 లక్షలతో ఒకే ఒక్క వ్యాపారం మాత్రమే చేసుకోవాలా? లేక, నచ్చిన వ్యాపారాలు చేసుకోవచ్చా?
  • దళితులు ఓ బృందంగా ఏర్పడి పెద్ద వ్యాపారాలు చేసుకోవచ్చా?
  • ఈ పథకం లబ్దిదారులు స్థానికంగానే ఉండాలా? లేక ఎక్కడైనా చేసుకోవచ్చా?
  • వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన వ్యవస్థలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందా?
  • దళితబంధులో భాగంగా అర్హులైన వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారా?
  • రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? వారిని అనర్హులుగా పరిగణిస్తారా?
  • వివాహ ధ్రువీకరణ పత్రాలు ఉంటే సరిపోతుందా?

ఈ సందేహాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వాలని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా, దళితబంధు పథకానికి నిధులు ఎక్కడ్నించి తెస్తారన్నది తెలిస్తే, సభలో చర్చించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. దళితబంధు లబ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా సాగాలని, అర్హులందరికీ న్యాయం జరగాలని పేర్కొన్నారు. దళితబంధు పథకానికి సంబంధించిన కమిటీల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు స్థానం కల్పించాలని సూచించారు.
Mallu Bhatti Vikramarka
Dalit Bandhu
Telangana Govt
Assembly

More Telugu News