Somireddy Chandra Mohan Reddy: లఖింపూర్ ఖేరీ ఘటన చాలా దురదృష్టకరం: టీడీపీ నేత సోమిరెడ్డి

TDP leader Somireddy comments on Lakhimpur incident
  • యూపీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి దూసుకొచ్చిన కారు
  • కేంద్రమంత్రి తనయుడిపై తీవ్ర ఆరోపణలు
  • రైతు చట్టాలు రద్దు చేయాలన్న సోమిరెడ్డి
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో నిరసనలు తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడు కారుతో దూసుకెళ్లిన ఘటనపై ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటన ఎంతో దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఎనిమిది మంది మరణానికి దారితీసిన ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

రైతులకు నష్టం కలిగించే ఈ చట్టాలను దేశమంతా వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టువిడుపులు చూపక తెగేదాకా లాగడం సరికాదని సోమిరెడ్డి హితవు పలికారు. ఇప్పటికైనా ఆ చట్టాలను రద్దు చేయాలని, అందరినీ కలుపుకుని రైతులు కోరుతున్న విధంగా కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలోని రైతులు స్వాతంత్ర్య పోరాటం తరహాలో పోరాడాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు.
Somireddy Chandra Mohan Reddy
Lakhimpur Kheri
Farmers
Death
Uttar Pradesh

More Telugu News