ట్రైలర్ ను రెడీ చేస్తున్న 'అన్నాత్తే'

05-10-2021 Tue 11:43
  • ఫస్టు సింగిల్ కి భారీ రెస్పాన్స్ 
  • బాలు పాడిన సింగిల్ కావడం విశేషం
  • ప్రధాన బలంగా భారీ తారాగణం
  • నవంబర్ 4వ తేదీన విడుదల  
Annaatthe movie update

రజనీకాంత్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అన్నాత్తే' సినిమా సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందువలన ఈ నెలలో ఈ సినిమా ప్రమోషన్లు పుంజుకోనున్నట్టుగా చెబుతున్నారు.

నిన్న ఈ సినిమా నుంచి 'అన్నాత్తే .. అన్నాత్తే' అనే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. బాలు ఉన్నప్పుడు రికార్డు చేసిన పాట ఇది. ఈ సింగిల్ కి ఇప్పుడు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. విజయదశమికి ట్రైలర్ ను వదలొచ్చని అనుకుంటున్నారు.

ఇక ప్రమోషన్స్ చేయడానికి ఉన్న సమయం ఈ నెల మాత్రమే కావడంతో, వరుసగా సాంగ్స్ కూడా వదలాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఖుష్బూ .. మీనా .. నయనతార .. కీర్తి సురేశ్ .. జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తోంది.