Sandal Wood: విషమంగా కన్నడ నటుడు సత్యజిత్ ఆరోగ్యం.. ఐసీయూలో చికిత్స

Veteran Kannada actor Satyajit admitted to hospital
  • గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యజిత్
  • ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక
  • ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రభుత్వం, ఫిలిం చాంబర్ ఆదుకోవాలన్న కుమారుడు ఆకాశ్ జిత్
శాండల్‌వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.  ప్రస్తుతం ఆయన బెంగళూరులోని బోరింగ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సత్యజిత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఇటీవల ఆయనకు పచ్చకామెర్లు సోకడంతోపాటు శుక్రవారం గుండెపోటు కూడా వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. 71 ఏళ్ల సత్యజిత్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. బీపీ, మధుమేహం కూడా ఉండడంతో ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని సత్యజిత్ కుమారుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చుల నిమిత్తం ఫిలిం చాంబర్, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

సత్యజిత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్. 650కిపైగా కన్నడ సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతోపాటు నెగటివ్ పాత్రల్లోనూ నటించారు.  అరుణరాగా, ఫైనల్ వెర్డిక్ట్, శివ అప్రిసియేటెడ్ కన్నప్ప, రంగరంగ, నమ్ముర రాజా, జస్టిస్ ఫర్ మి, మాండ్యాస్ మేల్, పోలీస్ స్టోరీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పటేల్, దుర్గా టైగర్ తదితర హిట్ సినిమాల్లో నటించారు.
Sandal Wood
Kannad Actor
Sayajit
Bengaluru
Hospital

More Telugu News