Andhra Pradesh: ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి పదవీకాలం మరో ఏడాది పొడిగింపు!

  • ఈ నెల 24తో ముగియనున్న లక్ష్మారెడ్డి రెండేళ్ల పదవీకాలం
  • గత నెల 26న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • నిన్న వెలుగులోకి వచ్చిన కొత్త ఉత్తర్వులు 
  Lakshamana Reddy to head prohibition campaign committee another one year

ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ కాలంలో ఆయనకు నెలకు రూ. 2 లక్షల వేతనం, వ్యక్తిగత సిబ్బంది భత్యం కింద రూ. 70 వేలు, వాహన భత్యం కింద రూ. 60 వేలు, మొబైల్ ఫోన్ చార్జీల కోసం రూ. 2వేలు, నివాస భత్యం కింద రూ. 50 వేలు, సెకండ్ ఏసీ రైలు ప్రయాణం, లేదంటే ఎకానమీ క్లాస్‌లో విమాన ప్రయాణానికి, అంతర్జాతీయంగా అయితే బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే సదుపాయం కల్పించింది.

అలాగే, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం కూడా ఉంది. మొత్తంగా రూ. 3.82 లక్షల వరకు చెల్లించనున్నట్టు పేర్కొంటూ గత నెల 26న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిన్న వెలుగులోకి వచ్చాయి. కాగా, రెండేళ్ల కాలానికి గాను 24 అక్టోబరు 2019లో వి.లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ నెల 24తో పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News