11 నుంచి నాలుగు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

05-10-2021 Tue 08:29
  • 11న బెంగళూరు మీదుగా రోడ్డుమార్గంలో కుప్పం
  • పార్టీ నేతలు, ప్రజలతో సమావేశం
  • ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక నేతలు
TDP chief Chandrababu visits kuppam for four days
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 11 నుంచి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. 11, 12వ తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు నిన్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు.