నాకు అర్బాజ్ తప్ప ఎవరూ తెలియదు: కోర్టుకు చెప్పిన షారుఖ్ తనయుడు

04-10-2021 Mon 20:45
  • ముంబై క్రూయిజ్‌ డ్రగ్ కేసులో కోర్టుకు హాజరైన ఆర్యన్ 
  • బెయిల్‌ పిటిషన్ తిరస్కరించిన ముంబై కోర్టు 
  • అక్టోబరు 7 వరకూ ఎన్సీబీ కస్టడీకి అప్పగింత 
I only know Arbaaz Merchantt says Aryan Khan

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు కాలేదు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తనకు అరెస్టయిన వారిలో అర్బాజ్ తప్ప మరెవరితోనూ పరిచయం లేదని ఆర్యన్ తెలిపాడు. అర్బాజ్, ఆర్యన్ మంచి స్నేహితులు. షారుఖ్‌ కుమార్తె సుహానాకు కూడా అర్బాజ్ స్నేహితుడే.

వీరు ముగ్గురూ కలిసి పలుపార్టీలు చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో అర్బాజ్ మాత్రమే తనకు తెలుసునని, మిగతా ఎవరితోనూ పరిచయం కూడా లేదని కోర్టుకు ఆర్యన్ వివరించాడు. అయితే ఆర్యన్‌, అతని మిత్రబృందాన్ని విచారించకపోతే కేసులో పూర్తి వివరాలు తెలియవని ఎన్సీబీ అధికారులు వాదించారు.

కనీసం వారంరోజుల పాటు వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ కోరినట్లు సమాచారం. అయితే గురువారం వరకూ ఆర్యన్‌, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్‌ దమేచాలను ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.