తెలంగాణలో కొత్తగా 207 మందికి కరోనా పాజిటివ్

04-10-2021 Mon 20:23
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 61 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,421 మందికి చికిత్స
Telangana covid report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు నిర్వహించగా, 207 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెలుగు చూశాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 239 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,409 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,421 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,923కి పెరిగింది.