Iran: మేం నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలి: ఇరాన్

Iran demands USA to pay 10 billion dollors
  • యురేనియం నిల్వలు పెంచుకుంటోందని ఇరాన్ పై ఆంక్షలు విధించిన అమెరికా
  • ఆంక్షల వల్ల తాము ఎంతో నష్టపోయామన్న ఇరాన్
  • నష్ట పరిహారాన్ని చెల్లించి ఆ తర్వాత చర్చలు జరపాలని వ్యాఖ్య

అమెరికా తీరుపై ఇరాన్ మరోసారి మండిపడింది. పరిమితికి మించి యురేనియం నిల్వలను ఇరాన్ పెట్టుకుంటోందంటూ ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2018 నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఇరాన్ వ్యాఖ్యానించింది.

ఆంక్షల వల్ల తాము నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే అణు ఒప్పందంపై చర్చలు జరపాలని చెప్పింది. అణు ఒప్పందంపై చర్చలకు అమెరికానే ముందుకు రావాలని తెలిపింది. అయితే చర్చలకు ఇరాన్ సర్కారు తొలుత ముందుకు రావాలని చెప్పడంతో ఇరాన్ పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News