'ఆచార్య' కూడా అదే రోజున వస్తాడట!

04-10-2021 Mon 18:05
  • 'ఆచార్య'పై 'ఆర్ ఆర్ ఆర్' ఎఫెక్ట్
  • డిసెంబర్ 17న అంటూ టాక్
  • అదే రోజున వస్తామన్న 'పుష్ప'
  • త్వరలో రానున్న క్లారిటీ  
Acharya movie update

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమాను పూర్తిచేశారు. కాజల్ కథానాయికగా చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించగా, ఆయన సరసన పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పెద్దగా గ్యాప్ అనేది లేకుండా, జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా థియేటర్లకు రానుంది. దాంతో 'ఆచార్య'ను డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయడం మంచిదనే అభిప్రాయానికి కొరటాల వచ్చాడట. చిరంజీవి కూడా ఆ తేదీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే డిసెంబర్ 17వ తేదీన 'పుష్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. నిజానికి 'పుష్ప' షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. మరి ఆ లోగా అన్ని పూర్తి చేసేసి థియేటర్లకు వస్తారా? చిరంజీవికి ఆ డేట్ ను ఇస్తారా? అనేది చూడాలి.