ఏపీలో 500కి దిగువన నమోదైన రోజువారీ కరోనా కేసులు

04-10-2021 Mon 18:02
  • ఏపీలో బాగా తగ్గిన కరోనా
  • గత 24 గంటల్లో 30,515 కరోనా పరీక్షలు
  • 429 మందికి పాజిటివ్
  • తూర్పుగోదావరిలో 89 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 9,753 మందికి చికిత్స
AP Corona report

ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. 30,515 మందికి కరోనా పరీక్షలు జరుపగా, 429 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 89 కొత్త కేసులు వెల్లడి కాగా, నెల్లూరు జిల్లాలో 85, చిత్తూరు జిల్లాలో 72, ప్రకాశం జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి.

అదే సమయంలో 1,029 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,192 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,29,231 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 9,753 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,208కి పెరిగింది.