Nagarjuna: నాగార్జునను చూస్తూ ఆ పాత్రను డిజైన్ చేశాను: కృష్ణవంశీ

  • కృష్ణవంశీ నుంచి వచ్చిన 'నిన్నే పెళ్లాడతా'
  • 1996లో ఇదే రోజున విడుదలైన సినిమా
  • నాగ్ ను రొమాంటిక్ హీరోను చేసిన చిత్రం
  • హిట్ లో కారణాలు చెప్పిన కృష్ణవంశీ
Ninne Pelladatha completed 25 years

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'నిన్నే పెళ్లాడతా' ఒకటి. ఈ సినిమాతో రొమాంటిక్ హీరోగా నాగార్జున ఎక్కువ మార్కులు కొట్టేశారు. 'ఎటో వెళ్లిపోయింది మనసు .. 'అనే పాట, నిజంగానే యూత్ మనసులను ఎటో ఎగరేసుకుపోయింది. అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడారు.

"ఈ సినిమాను నేను నాగార్జునతో చేయాలని అనుకున్న తరువాత, బయట ఆయన ఎలా ఉంటారనే విషయాన్ని పరిశీలించడమే పనిగా పెట్టుకున్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే ఆ పాత్రను డిజైన్ చేశాను. అందువల్లనే ఆ సినిమాలో నాగార్జున పాత్ర అంత సహజంగా అనిపిస్తుంది. తెరపై కాకుండా మన ముందు ఆ పాత్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఈ సినిమా హిట్ కావడానికి మరో కారణం .. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అందించిన సాహిత్యం. 'నా మొగుడు రామ్ ప్యారీ' మినహా మిగతా పాటలన్నీ ఆయనే రాశారు .. అన్ని పాటలు హిట్. ఈ సినిమా విజయంలో ఆయన అందించిన పాటలు కీలకమైన పాత్రను పోషించాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News