దీపావళినే ఖాయం చేసుకోనున్న 'అఖండ'

04-10-2021 Mon 17:08
  • ముగింపు దశలో 'అఖండ'
  • దసరాకి రిలీజ్ లేనట్టే 
  • దీపావళికి రిలీజ్ అంటూ టాక్ 
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి
Akhanda movie update

బాలకృష్ణ తన సినిమాలను వీలైతే సంక్రాంతికి .. లేదంటే దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రెండు పండుగలు ఆయనకి సెంటిమెంట్. ఈ పండుగ రోజులలో వచ్చిన ఆయన సినిమాలు చాలావరకూ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆయన ప్రత్యేక శ్రద్ధపెడుతూ ఉంటారు.

అలా ఈ సారి కూడా ఆయన దసరా బరిలోకి 'అఖండ' సినిమాను దింపుతారని అంతా అనుకున్నారు. అప్పటికి సినిమా పనులు పూర్తికావనే టాక్ రావడంతో, ఇక సంక్రాంతికి వస్తుందని భావించారు. కానీ ఈ రెండు పండగలకి మధ్యలో .. 'దీపావళి'కి రావడానికి 'అఖండ'ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ తేదీని 'గని' ఫిక్స్ చేసుకున్నాడు. రీసెంట్ గా వాయిదా పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే తేదీన 'అఖండ' రానున్నట్టు చెబుతున్నారు.