తెలంగాణ, ఏపీ సహా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

04-10-2021 Mon 16:23
  • విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పిలుపు
  • రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుదామన్న స్టాలిన్
  • ప్రధానంగా నీట్ ప్రస్తావన
  • ఏకే రాజన్ కమిటీ నివేదికను పంచుకున్న వైనం
Stalin wrote Letter to twelve chief ministers

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో... విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పేర్కొన్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని వివరించారు.

తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు.