Prakash Raj: ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకి కృతజ్ఞతలు తెలిపిన ప్రకాశ్ రాజ్

Prakash Raj thanked AP CM Jagan and minister Perni Nani
  • అక్టోబరు 10న మా ఎన్నికలు
  • హోరాహోరీగా ప్రచారం
  • 'మా' ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న పేర్ని నాని
  • నాని ప్రకటను స్వాగతించిన ప్రకాశ్ రాజ్
  • బాధ్యతగా స్పందించారని కితాబు
'మా' ఎన్నికల్లో తమ జోక్యం ఉండబోదని, సినీ రంగానికి చెందిన ఎన్నికలపై తమకు ఆసక్తిలేదని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనను నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో బాధ్యతాయుతంగా స్పందించి ప్రకటన చేశారని పేర్కొన్నారు. 'మా' ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ స్పందనను గౌరవిస్తున్నానని తెలిపారు.

కాగా, సీఎం జగన్ తమ బంధువు అని 'మా' ఎన్నికల్లో తన ప్రత్యర్థి మంచు విష్ణు చెప్పుకుంటుండడాన్ని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా? అని ప్రకాశ్ రాజ్ ఓ ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు.
Prakash Raj
CM Jagan
Perni Nani
Andhra Pradesh
MAA Elections
Tollywood

More Telugu News