Madhav: ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టే దుస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చింది: ఎమ్మెల్సీ మాధవ్

  • పవన్ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పడం లేదు
  • క్రిస్టియన్ మతంపై కనీస అవగాహన కూడా లేని వారికి బాప్టిజం ఇప్పించారు
  • జగన్ తాడేపల్లిలోని ఇంటికే పరిమితమయ్యారు
Jagan govt is pledging govt lands says MLC Madhav

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి పవన్ మాట్లాడితే...  దానికి సమాధానం చెప్పలేక మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఇంత వరకు ఐటీడీఏలో సాధారణ సమావేశాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించలేదని... ఇది గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వైఖరికి నిదర్శనమని అన్నారు.

క్రిస్టియన్ మతంపై కనీస అవగాహన కూడా లేని వారికి అప్పటికప్పుడు బాప్టిజం ఇప్పించారని... వారికి స్థానిక పరిషత్ ఎన్నికల్లో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. రాజు ఇంటికే పరిమితమయినట్టుగా... జగన్ తాడేపల్లిలోని ఇంటికే పరిమితమయ్యారని విమర్శించారు. చివరకు విశాఖలో ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టే దుస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు.

More Telugu News