Nallapureddy Prasanna Kumar Reddy: నా ఊరిలో ఉనికిని కోల్పోవడం చూస్తే కన్నీళ్లొస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

Loosing identity in own village is very sad says Nallapureddy Prasanna Kumar Reddy
  • వైసీపీ నేతలు లంచాలు అడుగుతున్నారు
  • కొందరు నేతల వల్ల తన కుటుంబం పరువు పోయింది
  • అవినీతి పనులు చేస్తే తాట తీస్తా
సొంత పార్టీ నేతలపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డి సొంత మండలంలో వైసీపీ ఎంపీటీసీ స్థానాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏ పని జరగాలన్నా వైసీపీ నేతలు లంచాలు అడుగుతున్నారని.... లంచాలు లేనిదే పని చేయడం లేదని మండిపడ్డారు.

కొందరు వైసీపీ నేతల వల్ల పార్టీ పరువు, తన కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కంచుకోటగా తయారు చేసిన తన మండలం, తన ఊరిలో తమ ఉనికిని కోల్పోవడాన్ని చూసి కన్నీళ్లొస్తున్నాయని అన్నారు. ఓపెనింగ్ కార్యక్రమాలకు పిలిచినా డబ్బులు డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంకోసారి అవినీతి పనులు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Nallapureddy Prasanna Kumar Reddy
YSRCP
Leaders
Corruption

More Telugu News