రైతు భూమి కొట్టేయాలని వైసీపీ నేతలు కుట్రలు చేయడం దారుణం: నారా లోకేశ్

04-10-2021 Mon 14:42
  • వైసీపీ నేతల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది
  • రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేశారు
  • అసలు సూత్రధారులను శిక్షించాలి
YSRCP leaders trying to grab farmers land says Nara Lokesh

వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి గారి కుటుంబం మొత్తం వారికి జీవనమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని అన్నారు. వైసీపీ నేతలు, స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయాలని కుట్రలు చెయ్యడం దారుణమని చెప్పారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.