యంగ్ హీరో రామ్ పోతినేని పోస్ట్ చేసిన ఫొటో చూసి షాక్ అవుతోన్న నెటిజ‌న్లు!

04-10-2021 Mon 13:34
  • రామ్ మెడ‌కు గాయం
  • ప‌ట్టీ వేయించుకున్న హీరో
  • జిమ్ లో గాయ‌ప‌డ్డాన‌ని వివ‌ర‌ణ‌
  • షూటింగ్ కు బ్రేక్
shoot halted due to his Neck injury during body transformation

యంగ్ హీరో రామ్ పోతినేని త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆయ‌న మెడ‌కు గాయం కావ‌డంతో మెడ‌కు ప‌ట్టీ వేసుకుని ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. త‌ల‌ను కూడా ఆయ‌న స‌రిగ్గా క‌దిలించ‌లేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా మెడకు గాయమైందని రామ్ పోతినేని చెబుతూ ఈ ఫొటో పోస్ట్ చేశాడు.

ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకోవాల్సి ఉండ‌డంతో రామ్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తుండ‌గా గాయ‌మైంది. ప్ర‌స్తుతం రాపో19గా  ఈ సినిమాను ప్ర‌చారం చేస్తున్నారు. రామ్‌కి గాయం కావ‌డంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.