Priyanka Gandhi: కసువూడ్చుకుంటున్న ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్

Priyanka Gandhi video of sweeping room going viral
  • పీఏసీ గెస్ట్ హౌస్ లో పోలీసుల అదుపులో ఉన్న ప్రియాంక
  • గెస్ట్ హౌస్ లోని గదిని శుభ్రం చేసుకున్న ప్రియాంక
  • శుభ్రంగా ఉన్న గదిని కూడా ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఫైర్
చీపురు చేతపట్టి గదిలో కసువు ఊడ్చుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను సీతాపూర్ లోని స్టేట్ పీఏసీ గెస్ట్ హైస్ లో ఉంచారు. ఈ గెస్ట్ హౌస్ లోని గదిని ఆమె ఊడుస్తుండగా తీసిన వీడియోను పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను చూసిన కాంగ్రెస్ శ్రేణులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకకు పరిశుభ్రంగా ఉన్న గదిని కూడా ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? అని ఒక కాంగ్రెస్ నేత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుభ్రంగా లేని గదిని ఇచ్చినప్పటికీ... ప్రియాంక ఏ మాత్రం భేషజాలకు పోకుండా గదిని తనకు తానే శుభ్రం చేసుకున్నారని కొనియాడారు.

నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పైనుంచి బీజేపీ శ్రేణులకు చెందిన కార్లు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పీఏసీ గెస్ట్ హౌస్ కు తరలించారు.
Priyanka Gandhi
Sweeping
Guest House
Police
Broom

More Telugu News