'ఒరిజిన‌ల్ రెబ‌ల్ స్టార్‌ను క‌లిశా'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన హీరో మంచు విష్ణు!

04-10-2021 Mon 13:26
  • మా ఎన్నిక‌ల్లో విష్ణు పోటీ
  • ఇప్ప‌టికే కృష్ణ‌ను క‌లిసిన మంచువార‌బ్బాయి
  • మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతోన్న విష్ణు
Took blessings of the original Rebel Star VishnuManchu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో హీరో మంచు విష్ణు పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌లువురు టాలీవుడ్ పెద్ద‌ల‌ను క‌లిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తాజాగా కృష్ణంరాజును క‌లిసిన మంచు విష్ణు ఆయ‌న‌తో ఫొటో దిగారు. ఒరిజిన‌ల్ రెబ‌ల్ స్టార్ ఆశీర్వాదం తీసుకున్నానంటూ ఫొటో పోస్ట్ చేశారు.

కాగా, ఇప్ప‌టికే మంచు విష్ణు సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. మంచు విష్ణు  ప్యానెల్‌లో జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీగా ర‌ఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల ర‌వి, పృథ్వీరాజ్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 10న 'మా' ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.