Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో స్వల్ప ఊరట

  • ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేశారంటూ పిటిషన్
  • ఇకపై కేసు నమోదు చేయాలంటే డీజీపీ అనుమతి తప్పనిసరి అన్న హైకోర్టు
  • విచారణ కూడా డీజీపీ పర్యవేక్షణలోనే జరగాలని ఆదేశం 
DGP permission is must to file case against Teenmaar Mallanna says TS High Court

తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఒకే కారణంతో మల్లన్నపై పలు కేసులు నమోదు చేశారంటూ ఆయన భార్య మాతమ్మ వేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఒకే కారణంతో పలు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇకపై కేసు నమోదు చేయాలంటే డీజీపీ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. మల్లన్నను అరెస్ట్ చేయడానికి కూడా డీజీపీ అనుమతి ఉండాల్సిందేనని చెప్పింది. విచారణ కూడా డీజీపీ పర్యవేక్షణలోనే జరగాలని ఆదేశించింది. కేసు నమోదు చేసిన తర్వాత 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాకే విచారణ జరపాలని చెప్పింది. మల్లన్నపై దాదాపు 35 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మల్లన్న బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు జరగనున్నాయి.

More Telugu News