ఇన్‌స్టాలో మ‌రో పోస్ట్ చేసిన హీరోయిన్ స‌మంత‌!

04-10-2021 Mon 12:43
  • ప్ర‌పంచాన్ని మార్చాలంటే ముందు న‌న్ను నేను  మార్చుకోవాలి
  • నా ప‌నుల‌న్నీ నేనే చేసుకోవాలి
  • ప్ర‌స్తుతం చేయాల్సిన ప‌నుల‌పై శ్ర‌ద్ధ పెట్టాలి
  • బ‌ద్ధ‌కాన్ని వ‌దిలి బెడ్‌పై నుంచి లేవాలి
samanta post on insta

టాలీవుడ్ జంట‌ స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌డంపైనే  ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వారిపై ఎన్నో వ‌దంతులు కూడా వ‌స్తున్నాయి. స‌మంత త‌దుప‌రి ఏం చేస్తుంది? ఆమె జీవితం ఎలా ఉండ‌నుంది? ఆమె నిరాశ‌లో ఉందా? అంటూ ఎన్నో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. తాజాగా, స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మ‌రో పోస్ట్ చేసి‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌పంచాన్ని మార్చాలంటే ముందు త‌న‌ను తాను మార్చుకోవాలని స‌మంత చెప్పింది. త‌న‌ ప‌నుల‌న్నీ తానే చేసుకోవాలని పేర్కొంది. ప్ర‌స్తుతం చేయాల్సిన ప‌నుల‌పై శ్ర‌ద్ధ పెట్టాలని, బ‌ద్ధ‌కాన్ని వ‌దిలి బెడ్‌పై నుంచి లేచి ముందుకు న‌డ‌వాలని చెప్పింది. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన హాలీవుడ్ పాట‌ను ఆమె వినిపించింది. స‌మంత‌కు సామాజిక మాధ్య‌మాల ద్వారా ఆమె అభిమానులు మ‌ద్దతు ప‌లుకుతున్నారు. ఆమె నుంచి వచ్చే పోస్టుల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.