నిజానికి నేను హీరోను అవుదామని అనుకోలేదు: వైష్ణవ్ తేజ్

04-10-2021 Mon 12:27
  • మేనమామల ప్రోత్సాహం ఎంతో ఉంది
  • కథల ఎంపికలో నిర్ణయం నాదే 
  • దర్శకత్వం వైపుకు వెళ్లాలని ఉండేది 
  • ఇప్పటికైతే కెరియర్ బాగుంది  
Kondapolam movie update
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా .. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండ పొలం' .. పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక కథాకథనాల పరంగా తన సత్తా చాటుకోవలసి ఉంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ బిజీగా ఉన్నాడు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను నటన వైపుకు రావడం వెనుక మా మేనమామల ప్రోత్సాహం ఎంతో ఉంది. అయితే నా సినిమాలకి సంబంధించిన కథల విషయంలో నిర్ణయాలు నేనే తీసుకుంటాను. నాకు నచ్చిన కథలను మాత్రమే చేస్తున్నాను. ఎవరి సొంత ఆలోచనలతో వాళ్లు ముందుకు వెళ్లాలనే మామయ్యలు చెప్పింది కూడా.

అందువలన అదే విధంగా నేను ముందుకు వెళుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు హీరోని కావాలని ఉండేది కాదు. డైరెక్షన్ .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ .. ఇలా ఏదో ఒక వైపుకు వెళదామని అనుకున్నాను. ఇప్పటికైతే కెరియర్ బాగుంది. తేడా కొట్టేస్తే వేరే ఫీల్డ్ కి వెళ్లడానికి నేను ఎంతమాత్రం మొహమాట పడను" అని చెప్పుకొచ్చాడు.