Lalu Prasad Yadav: లాలు ప్రసాద్ కుమారుల మధ్య తీవ్రస్థాయికి చేరిన విభేదాలు.. తమ్ముడిపై తీవ్ర ఆరోపణలు చేసిన అన్న తేజ్ ప్రతాప్

Tej Pratap says Lalu is being held captive in Delhi
  • తన తండ్రిని ఢిల్లీలో బంధించారన్న తేజ్ ప్రతాప్
  • నలుగురైదుగురు వ్యక్తుల కారణంగా పాట్నా రాలేకపోతున్నారని ఆరోపణ
  • అనారోగ్యం కారణంగానే ఢిల్లీలో ఉన్నారన్న తేజస్వీ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్ ఇటీవల బెయిలుపై బయటకు వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లాలు పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు చెబుతున్నారు. తన తండ్రిని కొందరు ఢిల్లీలో బంధించారని, బీహార్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నలుగురైదుగురు వ్యక్తుల కారణంగా తన తండ్రి పాట్నా రాలేకుపోతున్నారని అన్నారు.

బీహార్ ప్రతిపక్ష నేత, తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అన్న చేసిన ఈ ఆరోపణలను తేజస్వీయాదవ్ ఖండించారు. అనారోగ్య కారణాలతో తన తండ్రి ఢిల్లీలో ఉంటున్నారని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజ్ ప్రతాప్ సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తుండడం గమనార్హం.
Lalu Prasad Yadav
Tejashwi Yadav
Tej Pratap Yadav
Bihar

More Telugu News