Osmania University: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు.. ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి అరెస్ట్

Osmania University PHD Student arrested in alleged links with maoists
  • ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్న శ్రీనివాస్
  • సోదాల్లో నిషేధిత సాహిత్యం, అనుమానిత వస్తువుల స్వాధీనం
  • మావోయిస్టు కీలక నేతలతో నేరుగా సంబంధాలు
  • సమావేశాలకు కూడా హాజరు
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఉస్మానియా విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన కోటా శ్రీనివాసగౌడ్ (38) హైదరాబాద్‌లోని బౌద్ధనగర్‌లో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్నారు. టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆయన ఉంటున్న ఇంటితోపాటు, ఓయూ హాస్టల్‌లో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు పత్రాలు, నిషేధిత సాహిత్యం, అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు కీలక నేతలతో నేరుగా సంప్రదించడంతోపాటు వారి సమావేశాలకు కూడా హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఓయూ సహా వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను మావోయిస్టు పార్టీలోకి పంపినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Osmania University
PHD Student
Maoist
Hyderabad

More Telugu News