Pakistan: భారత్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాకు దూరంగా ఉండండి: పాక్‌ జట్టుకు మాజీ పేసర్ ఉమర్‌గుల్‌ సలహా

Avoid social media 2 3 days before T20 WC match vs India Gul to Pak
  • మీడియా కథనాలు చూస్తే ఒత్తిడి పెరుగుతుందన్న ఉమర్‌గుల్‌
  • జట్టుపై విమర్శలను తప్పుబట్టిన మాజీ పేసర్‌
  • ఈ సమయంలో జట్టుకు అండగా ఉండాలని పిలుపు
కరోనా కారణంగా వాయిదా పడిన టీ20 ప్రపంచకప్‌ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన పాకిస్థాన్‌ జట్టుపై పలువురు మాజీలు పెదవి విరుస్తున్నారు. కొందరు క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తూ వారిని జట్టులో చేర్చడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్‌గుల్‌ జట్టుకు అండగా నిలిచాడు.

జట్టుపై విమర్శలు చేయడం తప్పుకాదని, కానీ ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించడం వల్ల వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటన రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని గుల్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి సమయంలో జట్టుకు అండగా నిలవాలని విమర్శకులకు పిలుపిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో టాప్ 4 చేరే సత్తా పాక్‌ జట్టుకు ఉందన్నాడు. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు రెండు, మూడ్రోజుల పాటు సోషల్ మీడియా, మీడియాకు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు సలహా ఇచ్చాడు.

ఇది హైవోల్టేజ్ మ్యాచ్ కావడంతో దేశం మొత్తం భారత్‌ను ఓడించాలని కోరుకుంటుందని చెప్పిన గుల్‌.. ఈ వార్తా కథనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతాయని చెప్పాడు. అలాగే టోర్నీ జరిగే యూఏఈ పరిస్థితులు పాకిస్థాన్ జట్టుకు సహకరిస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్-పాక్‌ జట్లు అక్టోబరు 24న టీ20 ప్రపంచకప్‌లో తలపడనున్నాయి.
Pakistan
T20 WC
umargul

More Telugu News