ఎదురుదెబ్బలు తగిలాయి...తగులుతూనే ఉన్నాయి: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మోహన్ బాబు

03-10-2021 Sun 21:25
  • ఏబీఎన్ చానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
  • కొన్ని ఎదురుదెబ్బల పట్ల మోహన్ బాబు ఆశ్చర్యం
  • పలు అంశాలతో మనస్తాపం చెందినట్టు వెల్లడి
  • తన సినీ జీవితాన్ని మాత్రం ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టీకరణ
Mohan Babu attends to Open Heart With RK

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఏబీఎన్ చానల్లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని, ఇప్పటికీ తగులుతూనే ఉన్నాయని తెలిపారు. కొన్ని దెబ్బలు ఇలా కూడా తగులుతాయా అనేంతగా ఆశ్చర్యం కలుగుతోందని వివరించారు.

తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నే వ్యక్తులు ఉన్నారని మోహన్ బాబు ఆరోపించారు. అలాంటి అంశాలు తనను మనస్తాపానికి గురిచేశాయని పేర్కొన్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీయగలరేమో కానీ, తన సినిమా జీవితాన్ని దెబ్బతీయడం మాత్రం ఆ పైవాడి వల్ల తప్పితే మరెవ్వరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.