హైదరాబాదులో 'రిపబ్లిక్' సినిమా చూసిన రేవంత్ రెడ్డి

03-10-2021 Sun 20:42
  • ఏఎంబీ థియేటర్ కు విచ్చేసిన రేవంత్ రెడ్డి
  • ఎమ్మెల్యే సీతక్క, గాయని స్మితలతో కలిసి వీక్షించిన వైనం
  • చిత్ర బృందానికి అభినందనలు
  • అక్టోబరు 1న రిలీజైన 'రిపబ్లిక్'
  • సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య జంటగా చిత్రం
  • దేవా కట్టా దర్శకత్వం
Revanth Reddy watched Republic movie in Hyderabad
రాజకీయ కార్యకలాపాలతో ఎంతో బిజీగా ఉండే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు 'రిపబ్లిక్' సినిమా వీక్షించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, దర్శకుడు దేవా కట్టా, గాయని స్మిత తదితరులతో కలిసి ఏఎంబీ సినిమాస్ లో రేవంత్ రెడ్డి 'రిపబ్లిక్' సినిమా చూశారు. అనంతరం యావత్ చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా బాగుందంటూ ప్రశంసించారు.

దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన 'రిపబ్లిక్' చిత్రంలో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించారు. ఇందులో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబరు 1న రిలీజైంది. ఈ సినిమా ఆలోచింపజేసేదిగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.