Covaxin: కొవాగ్జిన్‌కు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు: జర్మనీ రాయబారి

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
  • ఆ తర్వాత జర్మనీలో గుర్తింపుపై ఆలోచన
  • కీలక విషయాలు వెల్లడించిన జర్మనీ రాయబారి
genmany said that no approval given to covaxin yet

వాల్టర్ జే లిండ్నర్ భారత్‌లో ప్రజలకు అందిస్తున్న రెండు వ్యాక్సిన్లలో కొవాగ్జిన్‌ ఒకటి. ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన యూకే ప్రభుత్వం భారతదేశం నుంచి వచ్చే వారిని వ్యాక్సిన్ తీసుకోని వారిగానే పరిగణిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వరుసలో మరో యూరప్ దేశం జర్మనీ కూడా ఒక ప్రకటన చేసింది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌కు జర్మనీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని లిండ్నర్ స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా గుర్తింపు లభించలేదని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు వచ్చిన తర్వాత తమ దేశంలో కొవాగ్జిన్‌కు గుర్తింపు ఇచ్చే విషయంలో ఆలోచిస్తామని అన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది.

More Telugu News