యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా స్పందించిన సాయిధరమ్ తేజ్

03-10-2021 Sun 18:41
  • సెప్టెంబరు 10న సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
  • కాలర్ బోన్ కు తీవ్రగాయం
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స
  • అప్పట్నించి అక్కడే చికిత్స
Sai Dharam Tej first response after road accident

గత నెల 10వ తేదీన హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయితేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ప్రమాద ఘటన తర్వాత తొలిసారిగా స్పందించాడు. దాదాపు నెల రోజుల అనంతరం ఓ ట్వీట్ చేశాడు.

తనపైనా, తన చిత్రం 'రిపబ్లిక్' పైనా చూపుతున్న ప్రేమాభిమానాలు, ఆపేక్ష పట్ల థాంక్స్ అని చెబితే అది చాలా చిన్న మాట అవుతుందని పేర్కొన్నాడు. త్వరలోనే అందరి ముందుకు వస్తానని సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో వెల్లడించాడు. అంతేకాదు, బొటనవేలిని పైకెత్తి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను కోలుకున్నానన్న సంకేతాలు పంపాడు.

సాయిధరమ్ తేజ్ ట్వీట్ పై ఆయన ప్రాణస్నేహితుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించాడు. లవ్యూ మిత్రమా... వెల్ కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు.