Philips: ఫ్యానుతో ఫేస్‌మాస్క్.. తయారు చేసిన ఫిలిప్స్ కంపెనీ

  • వేడి, తేమ, కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించే టెక్నాలజీ
  • సంప్రదాయ మాస్కుల సమస్యలు తగ్గించేలా డిజైన్
  • ఫ్రెష్ ఎయిర్ మాస్క్ పేరుతో తెస్తున్న టెక్ కంపెనీ
Philips launches Fresh air mask

ప్రస్తుత కరోనా కాలంలో ఫేస్ మాస్కు అందరికీ తప్పనిసరి అయింది. అయితే సాధారణ మాస్కులు ధరించడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. మాస్కులో తేమ ఎక్కువై చెమటలు పోయడం, కార్బన్ డై ఆక్సైడ్ కారణంగా వేడిగా మారడం వంటి ఇబ్బందులు సర్వసాధారణం. కానీ కరోనా భయంతో వీటన్నింటినీ ప్రజలు భరిస్తున్నారు. అయితే వీరందరికీ గుడ్‌న్యూస్ చెబుతోంది టెక్ కంపెనీ ఫిలిప్స్. ఈ కంపెనీ నుంచి కొత్తగా విడుదలవుతున్న ’ఫ్రెష్ ఎయిర్ మాస్క్‘తో ఇలాంటి సమస్యలు ఉండబోవని అంటోంది. ఇలాంటి సమస్యలను తగ్గించే సాంకేతికతను ఈ మాస్కుల్లో వాడామని చెబుతోంది.

అంతేకాదు ఈ మాస్కులో ఫ్యాన్ కూడా అమర్చారట. దీని వల్ల మాస్కులో తేమ, వేడి వంటివి తగ్గిపోతాయి. దీనిలో నాలుగు లేయర్ల నాన్-వాల్వ్ ఫిల్టర్ డిజైన్ ఉంది. ఈ మాస్కు ధరించడం వల్ల ఊపిరి తీసుకోవడంలో కూడా సమస్యలు ఉండవని ఫిలిప్స్ కంపెనీ వెల్లడించింది. కరోనా నుంచి రక్షణతోపాటు కంఫర్ట్‌గా కూడా ఉండేలా ఈ మాస్కులను తయారు చేసినట్లు ప్రకటించింది. మరి మీరు కూడా దీనిపై ఒక లుక్కేయండి.

More Telugu News