CM Jagan: తన మామ గంగిరెడ్డికి సీఎం జగన్ పుష్పాంజలి... ఫొటోలు ఇవిగో!

CM Jagan pays floral tribute to his father in law
  • గతేడాది మరణించిన సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి
  • పులివెందులలో ప్రథమ వర్థంతి కార్యక్రమం
  • కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన సీఎం జగన్
  • 'మరపురాని జ్ఞాపకం...' పుస్తకం ఆవిష్కరణ
సీఎం జగన్ మామ (వైఎస్ భారతి తండ్రి) ఈసీ గంగిరెడ్డి గతేడాది అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. ఈసీ గంగిరెడ్డి ప్రముఖ పిల్లల వైద్యుడిగా రాయలసీమ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బడుగు వర్గాల వైద్యుడు అని ఆయన గురించి చెప్పుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చి పులివెందుల ఎంపీపీగానూ వ్యవహరించారు.

కాగా, ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ పులివెందులలో ఘనంగా నివాళులు అర్పించారు. తన మామ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పులివెందుల లయోలా కాలేజిలో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఈసీ గంగిరెడ్డిపై రూపొందించిన 'మరపురాని జ్ఞాపకం-డాక్టర్ ఈసీ గంగిరెడ్డి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
CM Jagan
EC Gangireddy
Tributes
Pulivendula

More Telugu News