Budda Venkanna: విజయసాయిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే డ్రగ్స్ గుట్టురట్టవుతుంది: బుద్ధా వెంకన్న

Buddha Venkanna alleges Vijayasai behind drugs trafficking
  • ఇటీవల గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
  • తెరపైకి విజయవాడ పేరు
  • తీవ్ర ఆరోపణలు చేస్తున్న బుద్ధా వెంకన్న
  • విజయసాయి ప్రమేయం ఉందని వెల్లడి
  • 'బిగ్ బాస్' కు అంతా తెలుసని వ్యాఖ్యలు
ఏపీలో డ్రగ్స్ దందాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి ప్రమేయం ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపిస్తున్నారు. విజయసాయి అల్లుడికి ఏపీలోని అనేక పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, ఆయా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందని అన్నారు. విజయవాడ చిరునామా ఉపయోగించుకుని ఎంతో తెలివిగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీని విలువ లక్షల కోట్లలో ఉంటుందని వివరించారు.

దీంట్లో ఈ రాష్ట్ర 'బిగ్ బాస్' తో పాటు విజయసాయికి కూడా భాగం ఉందని తెలిపారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి గత పది రోజులుగా కనిపించడంలేదని బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయసాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ భాగోతం గుట్టురట్టవుతుందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత 'బిగ్ బాస్' పై ఉందని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి డ్రగ్స్ రవాణా వ్యవహారంపై 'బిగ్ బాస్' ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
Budda Venkanna
Vijayasai Reddy
Drugs
Andhra Pradesh

More Telugu News