Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు విషయంలో సర్కార్ పై దేవినేని మండిపాటు

Devineni Fires On Government Over Polavaram Project
  • నిర్వాసితులను నిండు గోదాట్లో ముంచారని ఆగ్రహం
  • ఓట్ల కోసం హామీలిచ్చి గాలికొదిలేశారని విమర్శ
  • ప్రాజెక్టు నిధుల గురించి కేంద్రాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీత

నిర్వాసితుల త్యాగం వల్లే పోలవరం కల నెరవేరుతోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అలాంటి నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం నిండు గోదావరిలో ముంచేసిందని, కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వారికి ఎన్నెన్నో హామీలిచ్చారని, కానీ, ఇప్పుడు వారిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు.

వైఎస్సార్ సీపీ పాలనలో సాగునీటి కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత మంది నిర్వాసితులను ఆదుకున్నారని ప్రశ్నించారు. సాగునీటితో రైతులకు జరిగిన మేలేంటో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులపై నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను సీఎం జగన్ ఎందుకు అడగడం లేదని నిలదీశారు.

  • Loading...

More Telugu News