ఎవరూ భయపడరు ఇక్కడ!: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని ఆగ్ర‌హం

03-10-2021 Sun 13:23
  • న‌లుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకోవ‌ద్దు
  • అందరికీ మేలు జరిగేందుకే నిర్ణయాలు
  • సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంత మందికే లాభాలు ఎందుకు?
  • చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలి
kodali nani fires on pawan

ఆన్‌లైన్ టికెట్ల విష‌యంలో ఏపీ స‌ర్కారుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు వ‌రుస‌గా మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై కొడాలి నాని స్పందించారు. ఈ రోజు ఓ కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకోద‌ని చెప్పారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు టికెట్ల ధరలు పెంచుకోవడాన్ని తాము సమర్థించబోమని అన్నారు.

తాము అందరికీ మేలు జరిగేందుకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంత మందికే లాభాలు తెచ్చి పెట్టే ధోర‌ణి వ‌ద్ద‌ని అన్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలని ఆయ‌న చెప్పారు. ప‌వన్ క‌ల్యాణ్ ఈ విష‌యంపై ఏదో మాట్లాడితే, బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడబోరని ఆయ‌న తేల్చి చెప్పారు.