Telangana: తెలుగు అకాడమీ నిధుల్లో గోల్ మాల్ కేసు.. మరో కొత్త కోణం!

  • అధికారులు ఫోర్జరీకి పాల్పడినట్టు గుర్తింపు
  • జైలులో ఉన్న అధికారుల కస్టడీకి పోలీసుల విజ్ఞప్తి
  • యూబీఐ, కెనరా బ్యాంకుల్లోని ఎఫ్ డీల్లో రూ.70 కోట్ల అక్రమాలు
Police Find Another Angle In Telugu Academy FDs Case

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్, సంతోష్ నగర్ శాఖల్లో రూ.60 కోట్లు, చందానగర్ లోని కెనరా బ్యాంకులో రూ.11 కోట్ల మేర ఫిక్స్ డ్ డిపాజిట్లలను స్వాహా చేశారన్న కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీతో పాటు ఏపీఎంసీ డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మస్తాన్ వలీతో పాటు నిందితులుగా ఉన్న సత్యనారాయణరావు, పద్మావతి, మొహియుద్దీన్ లు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసుల దర్యాప్తులో అధికారులు ఫోర్జరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే ఫిక్స్ డ్ డిపాజిట్లను కాజేసినట్టు చెబుతున్నారు. కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు జైలులో ఉన్న నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.

More Telugu News