విడాకుల ప్ర‌క‌ట‌న‌ త‌ర్వాత‌.. ట్విట్ట‌ర్‌లో మ‌ళ్లీ ప్రొఫైల్ పేరు మార్చేసిన హీరోయిన్ స‌మంత‌!

03-10-2021 Sun 12:30
  • చైతూతో విడిపోతున్న‌ట్లు నిన్న ప్ర‌క‌ట‌న‌
  • కొన్ని నెల‌ల క్రితం త‌న పేరు ప‌క్క‌న 'అక్కినేని' పేరును తొల‌గించిన సామ్  
  • అప్ప‌టి నుంచి మొన్న‌టి వ‌ర‌కు 'ఎస్'గా పేరు పెట్టుకున్న స‌మంత‌
  • మ‌ళ్లీ 'స‌మంత‌'గా త‌న పేరును పెట్టుకున్న సామ్ 
samanta changes her name in twitter
టాలీవుడ్ జంట‌ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. వారు విడాకులు తీసుకుంటున్నార‌ని కొన్ని రోజులుగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నప్ప‌టికీ స్పందించ‌ని వారిద్ద‌రు నిన్న‌ సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా తాము విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.

కొన్ని రోజుల క్రితం స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చ‌డంతో ఆమె నాగ‌చైత‌న్య‌తో విడిపోనుంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నాగ చైత‌న్య‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె ట్విట్ట‌ర్‌లో త‌న‌ పేరును స‌మంత అక్కినేనిగా మార్చుకోగా, కొన్ని నెల‌ల క్రితం అక్కినేని పేరును తొల‌గించింది.

త‌న పేరును 'ఎస్' గా పెట్టుకుంది. త‌న పేరులో మొద‌టి అక్ష‌రాన్ని మాత్ర‌మే ఆమె ఉంచింది. నిన్న చైతూతో విడిపోతున్నాన‌ని ఆమె అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత మ‌ళ్లీ  'ఎస్' అక్ష‌రాన్ని తొల‌గించి 'స‌మంత'గా మార్చేసుకుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు స‌మంత అంటూ ఆమె అభిమానులు బాధ‌ప‌డిపోతున్నారు.