పవన్‌ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఆగ్ర‌హం

03-10-2021 Sun 12:12
  • కులాలను రెచ్చగొట్టేలా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు
  • అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప‌వ‌న్ కు క‌నిపించడం లేదు
  • టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దతు
  • అందుకే బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయ‌ట్లేదు
mithun reddy slams pawan

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ... కులాలను రెచ్చగొట్టేలా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ చేస్తోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప‌వ‌న్ కు క‌నిపించడం లేదని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి జగన్ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన‌ హామీలను అమలుచేస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు జ‌గ‌న్ న్యాయం చేశార‌ని ఆయ‌న అన్నారు. టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దతు ఇస్తోంద‌ని, అందుకే త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేయట్లేద‌ని అన్నారు. అలాగే, తిరుపతి లోక్‌స‌భ ఉప‌ ఎన్నికలోనూ జనసేన పోటీ చేయ‌కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింద‌ని ఆయ‌న ఆరోపించారు.