NCB: ముంబై తీరంలో షిప్‌లో రేవ్‌పార్టీ.. పోలీసుల అదుపులో బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు

Rave party busted on ship near Mumbai Bollywood superstars son among likely detained
  • రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయంపై సమాచారం
  • గత రాత్రి అకస్మాత్తుగా దాడిచేసిన ఎన్‌సీబీ అధికారులు
  • పెద్దమొత్తంలో కొకైన్, ఎండీ స్వాధీనం
  • పది మంది వరకు యువతీ యువకుల అరెస్ట్
  • మరికాసేపట్లో ముంబైకి నిందితులు
ముంబై తీరంలోని ఓ ఓడలో జరిగిన రేవ్ పార్టీపై గత అర్ధరాత్రి దాడిచేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు పలువురు యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తీరంలోని కార్డిలియా క్రూయజెస్ ఎంప్రెస్ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు  సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు అకస్మాత్తుగా దాడిచేసి తనిఖీలు చేశారు.  

ఈ సందర్భంగా పెద్దమొత్తంలో కొకైన్, ఎండీని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో చిందులేస్తున్న దాదాపు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కాసేపట్లో ముంబైకి తీసుకురానున్నారు.  కాగా, బాలీవుడ్ సహా అన్ని చిత్రపరిశ్రమలను డ్రగ్స్ భూతం వేధిస్తున్న సమయంలో తాజాగా ఓ సూపర్ స్టార్ తనయుడు రేవ్ పార్టీలో దొరకడం మరోమారు  చర్చనీయాంశమైంది.
NCB
Mumbai
Bollywood
Drugs
Ship
Bollywood Actor

More Telugu News