Bhabanipur: భవానీపూర్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత

  • ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశం
  • బీజేపీ నుంచి బరిలో ప్రియాంక టిబ్రేవాల్
  • మరో రెండు గంటల్లో వెల్లడికానున్న సరళి
Bhabanipur Vote Counting Started

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భవానీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పది గంటలకల్లా సరళి వెల్లడికానుండగా, మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబరు 30న భవానీపూర్ ఉప ఎన్నిక జరగ్గా 57 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత మళ్లీ ఎన్నిక కావడం అనివార్యమైంది. దీంతో భవానీపూర్ నుంచి ఎన్నికైన టీఎంసీ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేసి మమత పోటీకి అవకాశం కల్పించారు. ఇక్కడి నుంచి మమత ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు.

More Telugu News