సమంతకు కళ్లు తిరిగే భరణం చెల్లించనున్న చైతన్య.. జోరుగా ఊహాగానాలు

03-10-2021 Sun 09:02
  • సమంతకు రూ. 300 కోట్లు చెల్లించబోతున్నారంటూ వార్తలు
  • కాదు.. రూ. 50 కోట్లేనంటున్న మరికొందరు
  • ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన ’ఫ్యామిలీ మ్యాన్ 2 ’ సినిమా?
Tollywood Actor Naga Chaitanya to give Rs 300 Crores as Maintenance to Samantha

టాలీవుడ్ నటుడు నాగచైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత కొత్త వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. వారి విడాకులపై సర్వత్ర చర్చ జరుగుతున్న వేళ.. సమంతకు నాగచైతన్య చెల్లించబోతున్న భరణం విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారి విడాకుల వెనక ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల్లో పలు అభ్యంతరకర సన్నివేశాల్లో నటించడమే వీరిద్దరి మధ్య విడాకులకు కారణమని చెబుతున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు చెలరేగడంతో కౌన్సెలింగ్ కూడా ఇప్పించారని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపించినా ఆ తర్వాత మళ్లీ చెడిందని చెబుతున్నారు. వారిని ఎలాగైనా కలిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి విడాకులు తీసుకున్నారని చెబుతున్నారు.

విడాకులు తీసుకున్నట్టు ఇద్దరూ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు భరణం అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊహాగానాల ప్రకారం.. సమంతకు రూ. 250 కోట్ల నుంచి రూ. రూ. 300 కోట్ల వరకు భరణం లభించే అవకాశం ఉంది. అయితే, కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. గరిష్ఠంగా రూ. 50 కోట్లు మాత్రమే చెల్లించే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ విషయంలో అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. వారు స్పందించే వరకు భరణం అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.