బతుకమ్మ పాటను రూపొందించిన ఏఆర్ రెహమాన్.. భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ

03-10-2021 Sun 07:21
  • ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం
  • బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే విడుదల
  • ఇతర భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు
Bathukamma Song directed by AR Rahman and goutham Menon
తెలంగాణ బతుకమ్మ పాట అంతర్జాతీయ స్థాయికి ఎదగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు.  ప్రముఖ గాయని పాడిన ఈ పాటను యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి సమీపంలో గత నెల 29, 30 తేదీలలో చిత్రీకరించారు.

ఈ వీడియో నాలుగు నిమిషాల నిడివి ఉండే అవకాశం ఉంది. రెహమాన్, గౌతమ్ మీనన్ కలిసి ఈ పాటను చిత్రీకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ లోపే ఈ పాటను విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ పాటను ఇతర భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.